Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : రంగశాపేట్ సంఘటన యావత్ బంజారా జాతి అలోచించి పోరాటానికి సిద్ధం అవ్వాలని : లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ పిలుపు వరంగల్ జిల్లాలోని రంగశాపేట్ లో ఎంతో భక్తి శ్రద్దలతో నిర్మించుకున్న బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి దొంగతనంగా తొలగించిన విషయంలో ఆలోచిస్తే ఈ దేశంలో బంజారాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా అణిచివేతకు గురి కావాలి. సేవాలాల్ మహారాజ్ విగ్రహాని తొలిగించి సభ్యసమాజంలో మా బంజారా జాతి మనోభావాలను దెబ్బతీసి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చుసిన వారిపైన తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకొని మా ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి అప్పచెప్పకపోతే రేపు జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హేచ్చరిస్తున్నాం.మా జాతిని ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల చాలా విధాలుగా ఇబ్బందులకి గురి అవుతున్న రాష్ట్రం ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇప్పటికైనా మా యావత్ బంజారా జాతికి ఒకటే చెపుతున్న మన హక్కులని మనకు ఎవరు అమర్చి ఇవ్వరు కాబట్టి జరిగిన ఈ రంగశాపేట్ సంఘటనని దృష్టిలో పెట్టుకొని మనం మన హక్కులను కొట్లాడి తీసుకోవాలి లేకపోతే ఈరోజు మన దేవుడికే దిక్కులేదు రేపటి రోజు మనకు కానీ మన జాతిని కానీ ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర బంజారా రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు మేధావులు వ్యాపారస్తులు కవులు జర్నలిస్టులు కార్మికులు వివిధ హోదాల్లో ఉన్న బంజారా ముద్దుబిడ్డలందరూ రావాల్సిందిగా మనవి సేవలాల్ మహారాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా పల్లవి రాజు నాయక్ బంజారా నాయకులందరూ పాల్గొనాలని మనవి
Admin
Mana Mahati News