Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు యూట్యూబర్ అరెస్టు* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 9 బాలలపై లైంగిక వేధింపుల వీడియోలు చేస్తూ, సామాజిక మాధ్యమ వేదికల్లో అప్‌లోడ్ చేసి, ప్రసారం చేసిన ఆరోపణలపై ఓ యూట్యూబర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విశాఖపట్నంలోని విశాలాక్షినగర్‌కు చెందిన కంబేటి సత్యమూర్తి (39)గా గుర్తించారు. ఇతడు వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తూ.. అభ్యంతరకరమైన, పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాడు. ఈ వీడియోల్లో 18 ఏళ్ల లోపున్న మైనర్ల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీటిలో నిందితుడు కావాలనే పిల్లలను అసభ్యకరమైన, లైంగికపరమైన అశ్లీల ప్రశ్నలు అడగటమే కాకుండా.. మైనర్లు ముద్దులు పెట్టుకునేలా ప్రేరేపించినట్లు విచారణలో వెల్లడైందన్నారు.2025 అక్టోబరు 16న వైరల్‌హబ్ యూట్యూబ్ ఛానల్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం అవుతున్నట్లు గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సాంకేతికపరమైన దర్యాప్తులో సత్యమూర్తిని నిందితుడిగా గుర్తించారు. అతడు 2018 నుంచి యూట్యూబర్‌గా పనిచేస్తూ.. వైరల్‌హబ్007 అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లూయెన్సర్లతో అసభ్య భాషలో ఇంటర్వ్యూలు చేసి, వ్యూస్ పెంచుకొని ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతడు బాలల రక్షణ చట్టాలు, సైబర్ చట్టాన్ని ఉల్లంఘించాడని చెప్పారు. సైబర్ ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో ఎస్‌ఐ సురేశ్ తమ బృందంతో కలిసి నిందితుడు సత్యమూర్తిని వైజాగ్‌లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
Admin
Mana Mahati News