Monday, 27 July 2026 11:30:58 PM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

* *చచ్చినా బతికినా తెలంగాణ కోసమే దేవుడి మీద ఒట్టు ఇదే నా కమిట్ మెంట్”*

Date : 04 January 2026 05:23 PM Views : 175

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *చచ్చినా బతికినా తెలంగాణ కోసమే దేవుడి మీద ఒట్టు ఇదే నా కమిట్ మెంట్”* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 4 సీఎం రేవంత్ రెడ్డి * కేసిఆర్ మాటలతోనే చంద్రబాబు బనకచర్ల ప్రతిపాదన చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి * తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా తాను ఎప్పటికీ వ్యవహరించనని వెల్లడి * తనకు సొంత ప్రాంత ప్రయోజనాల తర్వాతనే పార్టీ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభ వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా తాను ఎప్పటికీ వ్యవహరించనని స్పష్టం చేస్తూ, గత పాలకుల నిర్ణయాలే నేటి వివాదాలకు కారణమని వివరించారు. నీళ్లు – నిజాలు అనే అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాలు, బనకచర్ల ప్రాజెక్టు, కృష్ణా జలాల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలంటూ 2016లోనే జల్‌శక్తిశాఖ సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్‌ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ చెప్పిన మాటలతోనే చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు ఆలోచన చేశారని పేర్కొన్నారు. కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన సమావేశాలకు కేసీఆర్‌ రెండు సార్లు హాజరయ్యారని గుర్తుచేశారు. కృష్ణా జలాల పంపకాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు కేసీఆర్‌ అంగీకరించి, ట్రైబ్యునల్‌ తుది తీర్పు వచ్చే వరకూ అదే కొనసాగిస్తామని సంతకం చేశారన్నారు. 2020లో వాటా పెంచుకునే అవకాశం వచ్చినా అప్పటి ప్రభుత్వం ఉపయోగించుకోలేదని విమర్శించారు. "నాకు నా ప్రాంతమే ముఖ్యం. ఆ తర్వాతనే పార్టీ. అందుకే అప్పట్లో బయటకు వచ్చా. సీఎం కుర్చీలో కూర్చొని తెలంగాణకు అన్యాయం జరిగేలా నేను ఎప్పుడూ ప్రవర్తించను’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను ఆపించిన చరిత్ర తమదేనని తెలిపారు. ఆ పనులు నిలిపివేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టమైన షరతు పెట్టామని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిజంగా ఆగిందో లేదో నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయించుకోవచ్చని సవాల్‌ విసిరారు. *‘‘చచ్చినా.. బతికినా.. తెలంగాణ కోసమే. ఇదే నా కమిట్‌మెంట్‌. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. తెలంగాణకు అన్యాయం జరగనివ్వను’’* అని సభలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా ప్రకటించారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :