Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి* ! హైదర్ బాద్ నివాస్ న్యూస్ జనవరి 4 ప్రజాభవన్, శాసనసభలో పీపీటీతో పాటు, ఉత్తమ్, రేవంత్ ప్రసంగాలు బూమరాంగ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రెండేండ్లుగా తట్టెడు మట్టి ఎత్తక పోవడం, దానిని జూరాల నుండి ఎందుకు చేపట్టలేదన్న వ్యాఖ్యలతో పాలమూరులో తీవ్ర వ్యతిరేకత రేవంత్ చర్యలపై ప్రజల్లో అనుమానాలు .. ఎక్కడ చూసినా పాలమూరు విషయంలో కాంగ్రెస్ వైఖరిపై చర్చ తాను అడగడం వల్లే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపారని శాసనసభ సాక్షిగా రేవంత్ అబద్ధాలు రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ ప్రభుత్వం .. కేసీఆర్ హయాంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో అనుమతులు లేని కారణంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు 2021 లోనే ఆగిపోయాయని ప్రకటనలో తెలిపిన ఏపీ ప్రభుత్వం శాసనసభలో చేసిన స్వయంగా తాను చేసిన ప్రకటన అబద్ధం అని వెల్లడి కావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హుటాహుటిన ముంబయి వెళ్లి న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో భేటీ నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులను పంపి ఎలా అడ్డుకోవాలి ? ఎలాంటి ఒప్పందాలు ఉన్నది న్యాయవాదికి నివేదించాలి కానీ రేవంత్ రెడ్డి వెల్లడం ఎందుకు ? అని సాగునీటి శాఖలో చర్చ
Admin
Mana Mahati News