Sunday, 26 July 2026 04:41:19 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం*

Date : 21 January 2026 06:37 PM Views : 186

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం* సికింద్రాబాద్ | తిరుమలగిరి, జనవరి 21: సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని విషాదంలో ముంచింది. పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలుడు తల్లి కళ్లముందే మృత్యువును ఆలింగనం చేసుకోవడం హృదయాలను కలచివేసింది. ఆర్కేపురం వంతెన నుంచి తల్లి తన కుమారుడిని స్కూటీపై పాఠశాలకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై స్కూటీ అదుపుతప్పడంతో తల్లి–బాలుడు ఇద్దరూ కిందపడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్మీ వాహనం కిందపడ్డ బాలుడి పైనుంచి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రమాద తీవ్రత స్పష్టంగా బయటపడింది. బాలుడిని కాపాడలేకపోయిన తల్లి పరిస్థితి అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తల్లికీ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్మీ వాహనం వేగం, రోడ్డు పరిస్థితులు, భద్రతా చర్యల్లో లోపాలపై విచారణ జరుపుతున్నారు. పాఠశాలల సమీపంలో వేగ నియంత్రణతో పాటు కఠిన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలన్న డిమాండ్ ఈ ఘటనతో మరింత బలపడుతోంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఒక చిన్నారి ప్రాణాలను బలిగొనడమే కాకుండా, ఓ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టేసింది.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: