Sunday, 26 July 2026 04:45:17 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

జనవరి 1 నుంచి కొత్త రూల్స్..?*

Date : 30 December 2025 11:05 PM Views : 227

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *జనవరి 1 నుంచి కొత్త రూల్స్..?* హైదరాబాద్ నివాస్ న్యూస్ డిసెంబర్ 30 మరో కొద్ది గంటల్లో 2025 ముగియబోతుంది. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు అందరూ సిద్దమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకు నేందుకు రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. కొంత మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టూర్‌కు వెళుతుండ గా.. మరికొంతమంది ఇంట్లోనే జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటు న్నారు. కొత్త ఏడాది వస్తుందంటే.. అందరిలోనూ నూతనోత్సా హం వస్తుంది. వచ్చే ఏడాది ఏయే పనులు చేయాలనేది ఓ లక్ష్యం పెట్టుకుంటారు. దీంతో పాటు న్యూ ఇయర్ వస్తుం దంటే ఆర్ధికంగా మనల్ని ప్రభావితం చేసే పలు విషయాల్లో మార్పు లు చోటుచేసుకుంటూ ఉంటాయి. బ్యాంకింగ్ నుంచి జీతాల వరకు 2026 లో జరగబోయే మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..... క్రెడిట్ రిపోర్ట్‌లో మార్పులు 2026 నుంచి మీ క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్‌లో మార్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి బ్యాంకింగ్ సంస్థలు అప్డేట్ చేస్తుండగా.. కొత్త ఏడాది నుంచి వారం రోజులకు ఒకసారి ఆ పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల సిబిల్ స్కోర్ విషయం లో మరింత పారదర్శకత ఉంటుందని, సులువుగా రుణాలు పొందేందుకు ఉపయోగపడుతుందని ఆర్బీఐ చెబుతోంది. దీని వల్ల మోసపూరితంగా లోన్లు పొందేవారికి చెక్ పడుతుందని అంటోంది. *సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి....* సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కేంద్రం వాటిని అరికట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక నుంచి సోషల్ మీడియా యాప్‌లు వాడాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది. సిమ్ బైండింగ్, వెరిఫికేషన్ చేసేకే యాప్స్ వాడేలా మార్పులు చేయాలని వాట్సప్, టెలిగ్రాం, స్పాప్ చాట్ లాంటి యాప్స్‌ను కేంద్రం ఆదేశించింది. దీంతో కొత్త సంవత్సరం నుంచి దీనిని అమలు చేయనున్నారు. *ప్రభుత్వ ఉద్యోగులకు పండగే....* ఇక జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గుల జీతాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇక 2026 నుంచి ఉద్యోగులకు డీఏ కూడా పెరగనుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల కనీస వేతనాల ను పెంచడానికి సిద్దమవు తున్నాయి. కొత్త సంవత్స రంలో పెంపును అమల్లోకి తీసుకురానున్నాయి. *గ్యాస్ సిలిండర్ ధరలు....* ప్రతీ నెల 1వ తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసు కుంటూ ఉంటాయి. ఆ తేదీన కొత్త రేట్లను ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను కాస్త తగ్గించారు. ఇక జనవరి 1న కొత్త ధరలను ప్రకటించను న్నారు. కొత్త ఏడాదిలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉంటాయనేది చూడాలి.!

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: