Sunday, 26 July 2026 05:54:35 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

* *దేశంలో భారీగా తగ్గిన ఏటీఎంల సంఖ్య. ఆ ఒక్క కారణంతో వేలాదిగా మూసివేత*

Date : 30 December 2025 11:03 PM Views : 165

Mana Mahati News - ఢిల్లీ / హైదరాబాద్ : *దేశంలో భారీగా తగ్గిన ఏటీఎంల సంఖ్య. ఆ ఒక్క కారణంతో వేలాదిగా మూసివేత* ఢిల్లీ/హైదరాబాద్ నివాస్ న్యూస్ డిసెంబర్ 30 దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరగడంతో ఏటీఎంల (ATMs) అవసరం క్రమంగా తగ్గుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య భారీగా తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన 'ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్' నివేదికలో వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు పెరగడం, ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రజలు మొగ్గుచూపుతుండటంతో బ్యాంకులు ఏటీఎంల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం 2024 మార్చి నాటికి 2,53,417గా ఉన్న ఏటీఎంల సంఖ్య.. 2025 మార్చి 31 నాటికి 2,51,057కు పడిపోయింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌ను భారీగా కుదించుకున్నాయి. గత ఏడాది 79,884గా ఉన్న ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలు, ఈ ఏడాది 77,117కు తగ్గాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ఈ సంఖ్య 1,34,694 నుంచి 1,33,544కు స్వల్పంగా తగ్గింది. ఆఫ్-సైట్ ఏటీఎంల మూసివేత ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే, బ్యాంకేతర సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంల (White Label ATMs) సంఖ్య మాత్రం 34,602 నుంచి 36,216కు పెరగడం విశేషం. ఇక ఏటీఎంల విస్తరణ విషయంలో.. ప్రభుత్వ బ్యాంకులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా సేవలు అందిస్తుండగా, ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఎక్కువగా మెట్రో నగరాలకే పరిమితమయ్యాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఏటీఎంలు తగ్గుతున్నప్పటికీ, బ్యాంక్ బ్రాంచుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. 2025 మార్చి నాటికి దేశంలో బ్యాంక్ శాఖల సంఖ్య 2.8 శాతం పెరిగి 1.64 లక్షలకు చేరింది. కొత్త బ్రాంచుల ఏర్పాటులో ప్రైవేట్ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే దూకుడుగా ఉన్నాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది.

Shobhan

Admin

Mana Mahati News

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: